FbTelugu

ట్విట్టర్ లో మోదీ ఫాలోవర్లు 60 మిలియన్లు

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ముందున్నారు. ఇవ్వాల్టితో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 మిలియన్లకు చేరుకున్నది.
ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నవారి జాబితాలో మోదీ మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 120 మిలియన్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 83 మిలియన్ల మందితో రెండో స్థానంలో ఉన్నారు.
మోదీ సోషల్ మీడియాలో దాదాపు అన్ని విషయాలపైన స్పందిస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలపైనే కాకుండా, క్రీడలు, సైన్స్, టెక్నాలజీ తదితర అంశాలపైనా పోస్టులు చేస్తూ నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటారు. ట్విట్టర్ లో అత్యధికులు ఫాలో అవుతున్న భారతీయుడు ప్రధాని మోదీనే. 2009లో ట్విట్టర్ ను ఉపయోగించడం మొదలుపెట్టారు.

You might also like