FbTelugu

రూ.4 లక్షల సాయంపై చేతులెత్తేసిన మోదీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స పొందుతూ చనిపోయిన కుటుంబాలకు రూ.4 లక్షల సాయం పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వాళ్లందరికీ డబ్బులు ఇస్తే కరోనా చికిత్సలకు నిధులు సరిపోవదని స్పష్టం చేసింది.
కరోనా పాజిటివ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద బాధితులను ఆదుకోవాలని పిటీషన్ లో కోరారు. ఇండియాలో ఇప్పటి వరకు 3,86,713 మంది కరోనా పాజిటివ్ తో చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అనధికారికంగా ఇంక ఎక్కువే చనిపోయి ఉంటారని అంచనా. వీళ్లందరికీ రూ.4 లక్షల చొప్పున సాయం చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులకు మాత్రే ఎక్స్ గ్రేషియా చెల్లిస్తారని, కరోనా బాధితులకు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం అఫిడవిట్ అందచేసింది. రాష్ట్రాలలో కరోనా నియంత్రణ చర్యలు, బాధితులకు అత్యవసర చికిత్స మందులు, ఇతర పరికరాల కోసం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపింది. జాతీయ విపత్తు నిధులను మళ్లిస్తే వరదలు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడం కష్టమవుతుందని కేంద్రం వెల్లడించింది. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద రాష్ట్రాలకు రూ.1113 కోట్ల నిధులు విడుదల చేశామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి, బాధితులకు ఇచ్చే సాయం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.