FbTelugu

రజనీకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

 చెన్నై: ఇవాళ తమిళ స్టార్ సినీ హీరో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా.. ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రజనీ కాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవితకాలం జీవించాలంటూ ఆకాంక్షించారు.

రజనీ కాంత్ ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రజనీ కాంత్ తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా సమాచారం. ఈ నెలాఖరులో రజనీ తన పార్టీ పేరు, గుర్తును ప్రకటించే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.