FbTelugu

మోదీ అహ్మదాబాద్ పర్యటన పూర్తి

అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పురోగతి పరిశీలించేందుకు ఇవాళ అత్యవసరంగా బయలుదేరారు. ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్ ను సందర్శించారు.
జైకోవ్ డీ వ్యాక్సిన్ ప్రయోగాలను అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

పీపీఈ కిట్ ధరించి ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉందని, మూడో దశ పూర్తయితే కాని చెప్పలేమన్నారు. సుమారు గంట పాటు ఆయన ప్లాంట్ లో గడిపి, వ్యాక్సిన్ పై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. పర్యటన పూర్తయిన తరువాత ప్రత్యేక విమానంలో ప్రధాని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. హకీంపేటలోని విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.