FbTelugu

రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ పై మోదీ స్పష్టత

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రజలనుద్దేశించి సందేశమివ్వనున్నారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. లాక్ డౌన్, కరోనా నియంత్రణపై మోదీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రులతో ఐదుసార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజాగా సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్ డౌన్ పై అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇప్పటికే మూడుసార్లు లాక్ డౌన్ పొడిగించిన ప్రధాని మరోసారి పొడిగిస్తారా ముగిస్తారా అనేది పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగియనున్నది. ప్రధాని తన ప్రసంగంలో వివిధ రంగాలకు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి.

You might also like