FbTelugu

తాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా కీలక భేటీ

న్యూఢిల్లీ: దేశంలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ, హోంమంత్రి మంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా దేశంలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డైన్ ఈ నెలాఖరుకి ముగియనుంది. తిరిగి లాక్ డౌన్ పొడగించాలా?

పొడగిస్తే ఏఏ ప్రాంతాల్లో పొడగించాలి, సడలింపులు ఏమైనా ఇవ్వాలా అన్న అంశంపై చర్చించారు. ఓ పక్క కరోనాతో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా మరో పక్క చైనా సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా దురాక్రమణలపై భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించారు.

You might also like