FbTelugu

రూ.10 కోట్ల తో మోడల్ పార్క్ అభివృద్ధి

విజయవాడ: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరం అభివృద్ధి కి చేయాలని అదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
సింగ్ నగర్ లో రూ.10 కోట్ల తో మోడల్ పార్క్ అభివృద్ధి కి మంత్రి సత్యానారాయణ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు నిధులు మంజూరు చేసి అయినా ఏడాది లోపు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ లో అత్యాధునికంగా, ఆదర్శంగా ఈ పార్క్ ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదలకు మంచి చేసే ప్రతిపని అడ్డుకుని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

మొదట 25 లక్షలు అనుకున్నాం, ఆ తరువాత 30 లక్షలు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారని సత్యనారాయణ తెలిపారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు, భూసేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. కోర్టుల నుంచి స్టే తీసుకు వచ్చి కుట్రలు చేస్తోంది.. టీడీపీ చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
టీడీపీ నేతలు పర్యటన పై మండిపడ్డారు. ఈ రోజు ఇవ్వాల్సిన పేదలు ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చు ఏమో కానీ, ఇవ్వడం మాత్రం ఖాయమని బొత్స సత్యానారాయణ అన్నారు.

You might also like