FbTelugu

లాక్ డౌన్ తరహానే.. : సిఎం ఉద్ధవ్

ముంబయి: మహారాష్ట్రలో రెండు వారాల పాటు లాక్ డౌన్ తరహానే ఆంక్షలు ఉంటాయని, అంత కఠినం కాదని సిఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఈ ఆంక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కేసులు బాగా పెరుగుతున్నాయని, ఆసుపత్రులలో మంచాలు, ఆక్సిజన్ కొరత అధికంగా ఉందని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. రెమిడెసివర్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోందని, ఆక్సిజన్ మొత్తం వైద్య అవసరాలకే వినియోగించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ప్రత్యేక విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానన్నారు. కరోనా వ్యాక్సిన్ల డోసులను పంపించాలని కోరామని, వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  అవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, 144 సెక్షన్ అమలులో ఉందని ఆయన హెచ్చరించారు. అత్యవసర సేవలకే ప్రజా రవాణా వాడాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసి ఉంటాయని, డోర్ డెలివరీ మాత్రం అందుబాటులో ఉంటుందన్నారు. నిర్మాణ రంగ పరిశ్రమకు ఇబ్బంది కలుగకుండా కూలీలు పనిచేసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మల్టి ఫ్లెక్స్ లు, సినిమా షూటింగ్ లు, ప్రార్థనా మందిరాలు, సెలూన్ దుకాణాలు, బ్యూటీ ఫార్లర్లు, పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు సిఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు

You might also like

Leave A Reply

Your email address will not be published.