FbTelugu

మొబిక్విక్ పై వండివార్చి దుష్ప్రచారం

ముంబయి: కొందరు సెక్యురిటీ రీసెర్చర్లు సోషల్ మీడియాతో చేతులు కలిపి వండివార్చిన వార్తలను తయారు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆన్ లైన్ చెల్లింపుల యాప్  మొబిక్విక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

వీరు మా విలువైన సమయాన్ని వృధా చేశారని, కీలక డేటా బయటకు పొక్కడంపై దర్యాప్తు చేయగా ఏమీ లేదని స్పష్టమైందని ఆ కంపెనీ ప్రకటించింది. ప్రతి వినియోగదారుడి డేటా సురక్షితంగా ఉందని, హ్యాక్ కు గురి కాలేదని, విక్రయించలేదని ఆ సంస్థ వెల్లడించింది. మొబిక్విక్ కు చెందిన ముఖ్యమైన డేటా బయటకు పోయిందని, 8.2 టెరా బైట్ల డేటా ఆన్ లో విక్రయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మొబైల్ నెంబర్లు, ఆధార్, వ్యక్తిగత సమాచారం వంటి వివరాలు డార్క్ వెబ్ లో ఉందన్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన లింక్ ను డార్క్ నెట్ లో పెట్టడంతో వినియోగదారులు కంగారు పడ్డారు. ఈ మొత్తం డేటాను 1.5 బిట్ కాయిన్లకు విక్రయించినట్లు సెక్యురిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. డేటా లీక్ అయిందని ఫ్రాన్స్ కు చెందిన నిపుణులు కూడా ధృవీకరిస్తున్నారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న మొబిక్విక్ లోతుగా విచారించి ఏమి లేదని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.