FbTelugu

ఆ ముగ్గురు కలిస్తే తప్పేంటి: ఎమ్మెల్సీ మాధవ్

విశాఖపట్నం: మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి భేటీ సాధారణ ప్రక్రియ గానే జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

విశాఖలో మాధవ్ మీడియాతో మాట్లాడుతూ వారి ముగ్గురికి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని అన్నారు. రాజకీయాల కోసం అయితే అత్యంత రహస్యంగా సమావేశం అయ్యేవారని ఆయన తెలిపారు. అయితే దీన్ని ఇదేదో పెద్ద సమస్యగా వైసీపీ రాద్దాంతం చేస్తుందని అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు వివరణ ఇచ్చారని మాధవ్ వివరించారు.

సోషల్ మీడియా పోస్టులు వ్యహరంలో రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ధోరణి పాటిస్తున్నదని ఆయన ఆరోపించారు. కేవలం ప్రతిపక్షాలు మీద మాత్రమే కేసులు నమోదు చేస్తూ, స్వపక్షాలను వదిలేస్తుందని విమర్శించారు. అందరికీ ఒకే విధంగా చర్యలు ఉండే విధంగా సైబర్ క్రైమ్ చట్టాలను సవరించాలని మాధవ్ అన్నారు.

You might also like