FbTelugu

కెసిఆర్ సభ వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నందున ఈ నెల 14 లో సిఎం కెసిఆర్ హాలిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వాయిదా వేసుకోవాలని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

జీవన్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో, నల్లగొండలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో భారీ జనంతో బహిరంగ సభ నిర్వహిస్తే కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న ఏపిలో కరోనా కారణంగా సిఎం జగన్ రెడ్డి తిరుపతి బహిరంగ సభ రద్దు చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. జగన్ మాదిరి కెసిఆర్ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టకొని సభ రద్దు చేసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.