FbTelugu

ఎమ్మెల్సీ బైఎలక్షన్ షెడ్యూల్ విడుదల

అమరావతి: టీడీపీ నుండి వైసీపీలో చేరిన పోతుల సునీత తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి బైఎలక్షన్ నిర్వహించేందుకు ఇవాళ(బుధవారం) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల (జనవరి) 11న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా జనవరి 18 కాగా.. 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. 21న నామినేషన్ల విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.