FbTelugu

ఎమ్మెల్యే వంశీకి పరాభవం

కృష్ణా: గన్నవరం టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. బావులపాడు మండలం మల్లవెల్లిలో ఎమ్మేల్యే ని గ్రామస్తులు అడ్డుకున్నారు.

తమ గ్రామం లోని రావొద్దు అంటూ రోడ్డు పై గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గ్రామంలోకి భారీగా మోహరించారు. గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ఆయన వచ్చిన సందర్భంగా ఈ వివాదం మొదలైంది. పోలీసులు బందోబస్తు కల్పించినప్పటికీ, గ్రామస్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఎమ్మెల్యే వంశీ చేసేది లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.