FbTelugu

గవర్నర్… బీజేపీ నేతగా వ్యవహరించొద్దు?

ట్వీట్ చేసి తొలగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఆయన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి. అయితేనేమి ఏకంగా రాష్ట్ర గవర్నర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. పార్టీ పెద్దలు వారించడంతో ఆ ట్వీట్ ను తొలగించారని అంటున్నారు. ఆయనే హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానం సైదిరెడ్డి.

కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ స్పందనం ఏమాత్రం బాగా లేదని, తను ఐదు లేఖలు రాసినా ఒక్క దానిపై చర్యలు తీసుకోలేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కరోనా నియంత్రించడం కష్టమని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గవర్నర్ మాట్లాడిన తీరు టీఆర్ఎస్ నాయకులకు రుచించడం లేదు.
ఇంకేముంది హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మంగళవారం నాడు గవర్నర్ పై ట్వీట్ చేశారు. బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించొద్దు అంటూ విమర్శించారు. ఈ ట్వీట్ ను పార్టీ పెద్దలు దాన్ని తొలగించాలని ఆయనను ఆదేశించారు. బీజేపీ విమర్శలకు స్పందించవద్దని, గవర్నర్ విషయంలో ఇదే వైఖరి అవలంభించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు.

You might also like