FbTelugu

పనీపాటా లేక పబ్జీ ఆడుకుంటున్నారు: రోజా

తిరుపతి: పనీపాటా లేక నారా లోకేష్ పబ్జీ ఆడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కు సీఎం జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. కరోనా కష్టకాలంలో దొంగల్లాగా రాష్ట్రం విడిచి పారిపోయారంటూ విరుచుకు పడ్డారు. బాబు తన పార్టీలోని అవినీతిపరులు అరెస్టయ్యే సరికి పరిగెత్తుకుంటూ వచ్చారని ఎద్దేవా చేశారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలందరికీ చేయూతనిచ్చినట్టు తెలిపారు.

You might also like