FbTelugu

కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే నిరసన

హైదరాబాద్: సంగారెడ్డి కి మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యికోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ధర్నాకు దిగారు.

లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కుమార్తె జయారెడ్డి తో కలిసి జగ్గారెడ్డి ఫ్లకార్డులు ప్రదర్శించారు. గత ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. తన నియోజకవర్గం పై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షబూనిందని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.