FbTelugu

ఎమ్మెల్యే నోముల మృతి

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా హైదర్ గూడ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
సీపీఎం పార్టీలో శాసనసభా పక్షం నేతగా పనిచేసిన నర్సింహ్మయ్య (64) పార్టీ బహిష్కరించడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాగార్జున సాగర్ లో మాజీ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డిపై మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల వెంట నడిచారాని, తెలంగాణ కోసం దశాబ్ధాలుగా వెంట నడిచిన పార్టీని కాదని ప్రజల ఆకాంక్ష కోసం టీఆర్ఎస్ లో చేరారని పలువురు రాష్ట్ర మంత్రులు కొనియాడారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్, మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.

1956 లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఉస్మానియాలో న్యాయశాస్త్రాన్ని చదివారు. 1999, 2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 భువనగిరి ఎంపీగా ఓటమి చెందిన ఆయన 2014 లో టీఆర్ఎస్ లో చేరారు. 2014 లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగార్జున సాగర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2018లో విజయం సాధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.