FbTelugu

టిఆర్ఎస్ లో టిడిఎల్పి విలీనం

హైదరాబాద్: ఏపీలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నిలకు మరో 24 గంటలకు సమయం ఉండగా తెలంగాణ రాష్ట్రం టిడిఎల్పి లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు టిఆర్ఎస్ లో చేరనున్నారు.

ఈ మేరకు టిడిఎల్పిని టిఆర్ఎస్ లో కలుపుతున్నట్లు అసెంబ్లి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ అందచేశారు. మెచ్చా నాగేశ్వర్ రావు తో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా స్పీకర్ ను కలిశారు. దీంతో తెలంగాణలో టిడిపి కి ఎమ్మెల్యేలు లేకుండా పోయారు. 2008లో జరిగిన ఎన్నికల్లో టిడిపి తరఫున వీరిద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పొత్తులో భాగంగా 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా రెండు సీట్లలో విజయం సాధించింది. ఓటు కు నోటు కేసులో విచారణను ఎదుర్కొంటున్న సండ్ర వెంకట వీరయ్య ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే చేరిపోయారు. తాజాగా నాగేశ్వర్ రావు చేరికతో టిడిపి కి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.