FbTelugu

కేసీఆర్ ఇంట్లో అందరూ ఆర్టిస్టులే: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ కుటుంబంలో ఒక్కొకరు ఒక ఆర్టిస్ట్ గా తయారయ్యారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు. బాత్రూమ్ ల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి హరీష్ రావు ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల పోరాటానికి మాత్రం రాలేదని ధ్వజమెత్తారు.

ఎంపీ జె.సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ ఆస్తులకు, రాజకీయంగా బినామీ తయారయ్యాడని జగ్గారెడ్డి ఆరోపించారు. రోడ్ల పక్కన రూపాయి రూపాయి చందాలు అడ్డుకున్న వాళ్ళు ఇవాళ వందల కోట్లకు పడగలెత్తారన్నారు. రాష్ట్రంలో కష్టపడే వాళ్లేమో అడుక్కు తినే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడుతాయని అనుకున్నారు కానీ వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. మంత్రు హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు ఎంపీ సంతోష్ కుమార్ ఒక్కొక్కరు ఒక ఆర్టిస్ట్ లుగా అవతరించారన్నారు. సంతోష్ ఈ మధ్య గ్రీనరీ అని ఒక కొత్త సినిమా చూపిస్తున్నాడని, ఈ భూమి పుట్టిన్నపటి నుండి వీళ్లే చెట్లు నాటిన్నట్లు చూపిస్తున్నారని అన్నారు. హీరో ప్రభాస్ ని తీసుకొచ్చి చెట్లు పెట్టిస్తాడు, ముంబయి నుండి హీరోయిన్ లను తెచ్చి మొక్కలు పెట్టిస్తాడని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ఇక్కడికి వచ్చి సమస్యలు తెలుసుకొని చెట్లు పెట్టించొచ్చు కదా..! అని అన్నారు. ఎక్కడ సంతోష్… ఎక్కడ తెలంగాణ… ఎక్కడ ఆర్టిస్ట్ లు అనేది అర్థం కావడం లేదని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.