FbTelugu

ఈటల రాజీనామా ఆమోదం

హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇవాళ ఉదయం ఆయన తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో అందచేశారు.

అందచేసిన రెండు మూడు గంటల వ్యవధిలో ఆమోదించి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసి)కి తెలియచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.