హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ కోరారు.
ఈ మేరకు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీలకు బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు. హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని లేఖలో తెలిపారు. అదే విధంగా తన నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారనే సమాచారం రావడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ అప్రమత్తమయ్యారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో లేఖ రాసినట్లు తెలిసింది.