FbTelugu

పద్దతి ప్రకారమే ఎమ్మెల్యే అరెస్టు: స్పీకర్

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు ను అదుపులోకి తీసుకునే ముందు  తనకు సమాచారం ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

ఎందుకు అరెస్టు చేస్తున్నాం,ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నామో ముందుగానే ఏసీబీ డీజీ, జైళ్ల శాఖలు నా దృష్టికి తీసుకొచ్చాయన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనలు ప్రకారమే అధికారులు వ్యవహరించారన్నారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు విషయంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు.

నేరస్తులకు కులం అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడు నేరం చెయ్యకపోతే నేరం ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ లో కుంభకోణం జరిగిందన్నారు. ఇన్వెస్టి గేటివ్ ఏజెన్సీలు ఏపీలో  ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాయన్నారు.

అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ, పూలే, అంబేడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు  ఏమి సంకేతం ఇస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతోందన్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదన్నారు.

ఆన్ లైన్ లో గవర్నర్ ప్రసంగం…

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ప్రసంగం ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలకు సభకు  హాజరు కావాలని ఆహ్వానాలు పంపుతున్నామన్నారు. 175 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 225 సీటింగ్ కెపాసిటీ ఉంది భౌతిక దూరం పాటించేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నామని తమ్మినేని వివరించారు.

You might also like