FbTelugu

బెజవాడలో రూ.6 కోట్ల మోసం

విజయవాడ: నగరంలో ఎంకె కన్ స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ రాత్రిరాత్రికే ఉడాయించింది. కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
తూర్పు గోదావారి జిల్లా రాజమహేంద్రవరం వాసి పట్నాల శ్రీనివాస రావు గత సంవత్సరం ఆగస్టులో విజయవాడలో రియల్ ఎస్టేట్ కార్యాలయం ప్రారంభించారు.

ఎంకె కన్ స్ట్రక్షన్ పేరుతో కార్యకలాపాలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో బ్రాంచి కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్లాట్ల విక్రయం కోసం ఇరవై మంది ఏజెంట్లను నియమించుకున్నది. విజయవాడ సమీపంలోని గన్నవరం, ముస్తాబాద్, అగిరిపల్లితో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో కూడా ప్లాట్లను కొనుగోలుదారులకు చూపించారు. భారీగా ఆఫర్లు ప్రకటించడంతో పలువురు కష్టమర్లు అడ్వాన్స్ లు చెల్లించి బుకింగ్స్ చేసుకున్నారు. బుకింగ్స్ చేసుకున్నవారందరూ రిజిస్ట్రేషన్ల కోసం వెంటపడ్డంతో అసలు కథం బయటపడింది. ఆఫీసు మూసివేసి ఉండడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని లేదా ఫ్లాట్లు రిజస్ట్రేషన్ చేయించాలని పోలీసులను కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.