FbTelugu

మిక్సుడు డోసు… సూపర్ పవర్

లండన్: ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ పై మిక్సుడు డోసులపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఫైజర్, ఆస్ట్రాజెనెకా కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు తీసుకున్న వారిలో రోగనిరోధకత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ అధ్యయానికి సంబంధించి అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ లో ఒక నివేదిక ప్రచురితమైంది. తొలి డోసులో ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. నాలుగు వారాల తరువాత ఆస్ట్రాజెనెకా కంపెనీకి చెందిన వ్యాక్సిన్ రెండో డోసు ఇచ్చారు. ఆ తరువాత వారిలో కరోనా వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలను గమనించారు.

ఈ రకంగా ఇవ్వడం మూలంగా యాంటీబాడీలతో పాటు టి కణాల వృద్ధి గణనీయంగా కన్పించినట్లు లాన్సెట్ కథనం వెల్లడించింది. ఒకే కంపెనీకి చెందిన తొలి, మలి డోసు తీసుకున్నవారి కన్నా వేర్వేరు కంపెనీల డోసులు తీసుకువారిలో అధికంగా యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మ్యాథ్యు స్నేప్ నేతృత్వం వహించారు. తొలి డోసు తీసుకున్న తరువాత 10 నెలల తరువాత కూడా రోగ నిరోధకత ప్రతిస్పందనలు ఉండడం విశేషం. మిక్సుడు డోసుల మధ్య 12 వారాల గడువుపై అధ్యయనం చేస్తున్నామని, వచ్చే నెలలో వాటి ఫలితాలు విడుదల చేస్తామని మ్యాథ్యు వెల్లడించారు. బూస్టర్ డోసు ప్రభావాన్ని కూడా అంచనా వేసేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయని, తదుపరి మోడెర్నా, నొవావాక్స్ వ్యాక్సినల్ మిక్సింగ్ పై పరిశోధనలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.