FbTelugu

మిషన్ 2024… పవార్ తో పికె భేటీ!

ముంబయి: భారతదేశాన్ని నరేంద్ర మోదీ కబంధ హస్తాల నుంచి తప్పించేందుకు ఇప్పటి నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పికె) వ్యూహాలకు పదును పెడుతున్నారు. శుక్రవారం నాడు ఎన్.సి.పి అధినేత శరద్ పవార్ తో సుధీర్ఘంగా చర్చించారు.
వీరిద్దరి భేటీ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన పై ఏడాదికాలంగా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీ బలం పుంజుకున్నది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలు కనబడడంత నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఉలికిపాటుకు గురయ్యారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు చర్యలు చేపట్టారు.

కరోనా వైరస్ పై నిర్లక్ష్యం, పెట్రోల్ ధరల మంట, నిత్యావసర ధరల పరుగులతో సామాన్య జనం మొదలు మధ్యతరగతి ప్రజలు భగ్గుమంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపారులకు మోదీ సర్కార్ అండగా నిలుస్తున్నదనే విమర్శలు పెరిగాయి. మోదీ పట్ల వ్యతిరేకత స్పష్టంగా ఉన్నా ప్రత్యామ్నాయ వేదిక లేకపోవడం స్పష్టంగా కన్పిస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ప్రత్యామ్యాయ వేదికను సిద్ధం చేస్తున్నారు. మిషన్ 2024 పేరుతో ఒక బ్లూ ప్రింట్ ను కూడా సిద్ధం చేశారు. మోదీకి ధీటుగా మరో బలమైన నేతను పట్టుకునే యత్నంలో ఉన్నారు. శరద్ పవార్ నాయకత్వాన్ని తెరమీదికి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈయనకు మద్దతుగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టనున్నారు. తన వ్యూహ రచనలో భాగంగా టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ తో పికె చర్చలు జరిపారు. ఈటలను బిజెపిలో చేర్చుకోవడంపై కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలకు బిజెపి గాలం వేయడం పట్ల కెసిఆర్ మంటతో ఉన్నారు. ఏపిలో సిఎం వైఎస్.జగన్ ను కూడా కూటమి వైపు రప్పించేందుకు పికె ప్రయత్నం చేయనున్నారు. పికె వ్యూహచతురతతో ప్రాంతీయ పార్టీలు ఒక వేదికగా ఏర్పడి వచ్చే ఎన్నికల నాటికి మోదీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.