FbTelugu

కనిపించకుండా పోయిన యువతుల ఆచూకి లభ్యం

గుంటూరు: కనిపించకుండా పోయిన యువతుల ఆచూకి లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళితే.. జిల్లాలోని పాతగుంటూరులో ఇంటినుంచి ముగ్గురు యువతులు కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు  వారిని బాపట్లలో గుర్తించారు.

పారిపోయిన ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కాగా.. ఒకరు మాత్రమే మేజరని తెలిపారు. ఆ యువతులను ఇవాళ వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like