FbTelugu

ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తప్పిన ముప్పు

తిరువనంతపురం: కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఫైలట్ విమానాన్ని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఇవాళ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలికట్ నుంచి విమానం బయలుదేరి కొద్ది సేపటికే కంపార్ట్ మెంట్ లో ఫైర్ హెచ్చరిక రావడంతో విమా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పైలట్ కు వివరించడంతో కోజికోడ్ లో ఎమర్జెన్సీ పర్మిషన్ తీసుకుని ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 17 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు. ప్రయాణీకులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.