FbTelugu

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

జగిత్యాల: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ప్రమాదం తప్పింది. కొండగట్టు లో ఇవాళ ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్తున్న ఆమె కాన్వాయ్ లోని ఐదు కార్లు ఒకదానికి మరొకటి బలంగా ఢీకొన్నాయి.

ముందుగా వెళ్తున్న వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనకాల ఉన్న వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో కవితతో పాటు ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. జగిత్యాల పర్యటన కోసం వచ్చిన కవిత కొండగట్టులో అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు భద్రతగా వచ్చిన ఐ.ఎస్.డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్) అధికారి వద్ద ఉన్న షార్ట్ గన్ స్ప్రింగ్ జారి పడిపోయింది. తన వెపన్ నుంచి స్ప్రింగ్ పడిపోయిందని గమనించిన ఆ అధికారి హైరానా పడ్డాడు.

ఐ.ఎస్.డబ్ల్యూ భద్రతా సిబ్బంది తమ పరిధిలోకి కనీసం పోలీసులను కూడా రానివ్వరు. వీరే నిత్యం కాపలాగా ఉంటారు. అందరూ వెతక్కా స్ర్పింగ్ దొరకడంతో ఊపరిపీల్చుకున్నారు. అయితే గన్ లోని స్ప్రీంగ్ ఎలా జారిపోయిందనేది మిస్టరీ గా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.