FbTelugu

మంత్రి హరీశ్ కు తప్పిన ప్రమాదం

సిద్దిపేట: ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు ఇవాళ రాత్రి బయలు దేరి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది.

కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ వద్దకు రాగానే కాన్వాయ్ కు అడ్డుగా అడవి పందులు వచ్చాయి. పందులను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనకాల ఉన్న పైలెట్ కారును బలంగా ఢీకొన్నది. ఆ వెనకాలే వస్తున్న మంత్ర హరీశ్ రావు కారు పైలెట్ కారును ఢీకొట్టింది. దీంతో మధ్య కారులో ఉన్న వ్యక్తులకు గాయాలు కాగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కార్ల ముందు భాగంలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ తరువాత హరీశ్ రావు వేరే వాహనంలో హైదరాబాద్ కు బయలుదేరారు. హరీశ్ కు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

 

road accident

You might also like

Leave A Reply

Your email address will not be published.