FbTelugu

15న ఎంఐ క్యూ ఎల్ఈడి టివి విడుదల

న్యూఢిల్లీ: ఆధునిక ఫీచర్లతో క్యూ ఎల్ఈడి టివి 4కె 75 ఇంచుల టివిని భారత మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు చైనా కంపెనీ షావోమి ప్రకటించింది. ఏప్రిల్ 23వ తేదీన నూతన క్యూ ఎల్ఈడి టివిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

ప్రీమియం బ్రాండ్ కింద ఈ టివిని విడుదల చేస్తున్నామని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారు చేసినట్లు షావోమి ప్రకటించింది. దీని ధర రూ.1.50 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2020 చివరలో 55 ఇంచుల క్యూ ఎల్ఈడి టివిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.