FbTelugu

తరగతి గదిలోనే మైనర్లు వివాహం

తూర్పుగోదావరి: తరగతి గదిలోనే ఇద్దరు మైనర్లు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తరగతి గదిలోనే ఇద్దరు మైనర్లు వివాహం చేసుకున్నారు.

అమ్మాయి మెడలో అబ్బాయి పసుపుతాడు కడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 17 నే ఈ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ తతంగం కాలేజి ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో వారిద్దరితో పాటూ.. వారికి సహకరించిన మరో విద్యార్థికి టీసీ ఇచ్చి కాలేజీ నుంచి పంపేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.