FbTelugu

మైనర్ తీరని బాలిక గర్భం… భర్త అరెస్టు

బెంగళూరు: మైనర్ కూడా తీరని అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కాకుండా గర్భవతి చేసిన భర్త పై కర్నాటక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయకోట ప్రాంతానికి చెందిన బాలిక (13) కు ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నెగౌండనూర్ గ్రామానికి చెందిన దేవరాజ్ (24) తో జనవరి 13న పెళ్లి జరిగింది.

రెండు రోజుల క్రితం బాలిక తనకు ఆరోగ్యం బాగా లేదని డెంకణికోట సమీపంలోని పంజపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి వెళ్లింది. వైద్యులు పరీక్షించి బాలికను గర్భవతిగా నిర్థారించారు. అయితే 13 సంవత్సరాలకే గర్భం దాల్చడంతో వైద్యులు పోలీసులకు, మహిళా సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్ పై పొక్సో చట్టం కింద కేసు పెట్టి బొక్కలో వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.