FbTelugu

ఇజ్రాయిల్ ఎంబసీ ముందు పేలుడు

ఢిల్లీ: ఇజ్రాయిల్‌ ఎంబసీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ కార్యాలయం భవనం సమీపంలోని పుట్ పాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే ప్రాణనష్టం జరగలేదు.

రోడ్డు డివైడర్ మధ్యనున్న మొక్కల కుండీ లో బాంబులను అమర్చి పేల్చారు. అక్కడ పార్క్ చేసి ఉన్న కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. ఎవరూ గాయపడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సీనియర్‌ పోలీస్‌ అధికారులు, ఫైరింజన్లు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. పేలుడు ధాటికి ఎంబసీ భవనానికి చెందిన కొన్ని కిటికీలు దెబ్బతిన్నట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రాంతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి నివాసాలకు కిలోమీటర్ దూరంలో నే ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.