FbTelugu

మాచవరం మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం, మచవరం గ్రామ సమీపంలో మిర్చీ కార్మికులతో వెళుతున్న ట్రాక్టర్ పై ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు పడడంతో 13 మంది మృతి చెందారు.

వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలను మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. ముఖ్యమంత్రి వీరికి అండగా ఉంటారని అన్నారు. ఇప్పటికే రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్టు తెలిపారు. ఇంటికో ఉద్యోగం, పొలం మజూరుపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు.

You might also like