FbTelugu

ముంపు ప్రాంతాల్లో నేడు మంత్రుల పర్యటన

వరంగల్: గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో తీవ్రంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో నేడు నలుగురు మంత్రులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడి స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.

You might also like