FbTelugu

నేరం చేసిందెవరైనా.. కఠిన శిక్షతప్పదు: బొత్స

* నేడు రామతీర్థంలో మంత్రుల పర్యటన
* నిరసనలు చేపట్టిన విపక్షాలు
విజయనగరం: రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఎవరైనా కఠిన శిక్ష తప్పదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ రామతీర్థం క్షేత్రాన్ని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ క్రమంలో విపక్షాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో మార్మోగింది. రామతీర్థాన్ని సందర్శించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

రామతీర్థం ఘటనపై తాము ఎంతో బాధపడుతున్నామని తెలిపారు. రాముడి విగ్రహాన్ని ఇలా చేయించినవాడు అసలు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసింది ఎవరైనా సరే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒకప్పుడు బీజేపీ అంటే సదభిప్రాయం ఉండేదని, ఇప్పుడది పోయిందని అన్నారు.చంద్రబాబు హయాంలో ఆలయాల విధ్వంసం జరిగితే అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రామతీర్థానికి వస్తే ఏంటి, పోతే ఏంటీ అంటూ ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.