FbTelugu

 త్వరలోనే డిగ్రీ పరీక్షలపై నిర్ణయం: మంత్రి సురేష్

విజయవాడ: డిగ్రీ, పీజీ పరీక్షలపై కేంద్ర నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యంశాలలో అనుమానాలకు నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 123 124 ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. నాడు- నేడు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అతి దారుణంగా ఉందన్నారు.

నాడు- నేడు లో 9 అంశాలు కచ్చితంగా మార్పు చేస్తామన్నారు. రివర్స్ టెండరింగ్ విధానంతో రూ.143 కోట్లను ఆదా చేసామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసే వాటిలో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడడం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి సురేష్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.