FbTelugu

యూజీ, పీజీ పరీక్షలు రద్దు చేయలేదు: మంత్రి సురేష్

విజయవాడ: యుజీ, పీజీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటివరకు ప్రయత్నాలు చేశామన్నారు. సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీ ల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నామన్నారు.
అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటం పై తుది నిర్ణయం వెల్లడిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.