FbTelugu

ఆగస్టులో ఏపి ఎంసెట్ పరీక్షలు: మంత్రి సురేష్

అమరావతి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నామన్నారు.
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, మెడికల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఎంసెట్) పరీక్ష కోసం ఈనెల 24న నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నామన్నారు. జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారన్నారు. జులై 25వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజులు చెల్లించవచ్చన్నారు.

జూలై 26 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆలస్య రుసుం రూ.500 తో ఫీజులు చెల్లించవచ్చని, ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు రూ.1 వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. ఆగస్టు 11 నుంచి 15 వరకు రూ.5వేలు, ఆగస్టు 16 నుంచి ఆగస్టు 18 వరకు రూ.10వేలు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈసెట్, ఐసెట్, పిజి సెట్, లా సెట్, ఎడ్ సెట్, పిఈ సెట్, పరీక్షలను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించామని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.