విశాఖపట్నం: మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరును కచ్చితంగా ఒక జిల్లాకు పెడతామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
విశాఖపట్నం బీచ్ రోడ్డులో అల్లూరి సీతారామరాజు 123 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే ఏడాది కేడీ పేటలో అల్లూరి సమాధిని, పాండ్రంగి మ్యూజియం అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఇందు కోసం రూ.200 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.