FbTelugu

వృద్ధ కళాకారుల పెన్షన్ పెంపు: మంత్రి శ్రీనివాస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో వృద్ధ కళాకారులకు ప్రస్తుతం చెల్లిస్తున్న వృధ్యాప్య పెన్షన్ ను రూ.1500 నుండి రూ.3016 కు పెంచుతున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్ల ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 – 2021 నుండి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెంచిన వృధ్యాప్య పెన్షన్లు వల్ల 2661 మంది కళాకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. తెలంగాణ కళలకు కాణాచి.

సకల కళల ఖజానా గా ఆయన అభివర్ణించారు. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల మన తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, భాష వంటివి నిర్లక్ష్యానికి గురైనాయన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ పెన్షన్ మొత్తం కేవలం రూ. 500/- వందలు మాత్రమే ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడగానే కళాకారుల పెన్షన్ ను రూ.500 నుండి రూ.1500 పెంచామన్నారు. ఈ సమావేశం లో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కెఎస్.శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.