FbTelugu

పెళ్లిలో ఏకంగా మంత్రి బంగారు కడియాన్నే దోచేశారు

ఓ మంత్రి అంటే భారీ సెక్యూరిటితో, నానా హంగామాతో ఉంటారు. కానీ నిన్న ఓ పెళ్లికి హాజరైన తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతి బంగారు కడియాన్నే దోచారు. వివరాల్లోకెళితే.. మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఓ వివాహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. దీంతో అక్కడ ఉన్న కొందరు అభిమానులు మంత్రితో సెల్ఫీ తీసుకున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన దుండగులెవరో మంత్రి చేతి కడియాన్నే దోచేశారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి వేతికే పనిలో పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More