FbTelugu

‘ప్రజా అవసరాలను తప్పక తీరుస్తాం’: మంత్రి ఈటల

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉండనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు ఏం అవసరం ఉన్నా వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రయివేటు వైద్య కళాశాలల్లో 15,040 పడకలు ఉన్నాయని, పీజీ వైద్య విద్యార్థుల సేవలతో పాటు నర్సింగ్‌, పారామెడికల్‌ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More