FbTelugu

మహారాష్ట్రతోనే కేసులు పెరుగుదల: మంత్రి ఈటల

హైదరాబాద్: దేశంలో 60 శాతం కేసులు మహారాష్ట్ర నుండే నమోదు అవుతున్నాయని, ఎలాంటి లక్షణాలు లేకుండా చాలా కేసులు వస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఆసుపత్రులలో ఏర్పాట్లు పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చిన తరువాత ట్రేసింగ్ వేగవంతం అయి మరణాల శాతం తగ్గిందన్నారు. టెస్టులు అవసరం అయితే రోజుకి లక్ష మందికి చేస్తామని, వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 56 వేల మందికి వాక్సిన్ ఇస్తున్నాం.. భవిష్యత్తు లో 1.5 లక్షల మందికి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనా సేవలు కూడా అందిస్తామన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీవ్ లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 11 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని, కర్ఫ్యూ అసలే ఉండదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని రకాల ఆసుపత్రుల్లో ఏర్పాట్లపై ఈ రోజు సమీక్షించామన్నారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్న పేషంట్ కి కిట్స్ అందిస్తామన్నారు. పి.హెచ్.సి స్థాయిలో పేషెంట్ కు డాక్టర్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుకుంటున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా పరీక్షలు చేసుకోవాలని కోరారు. అవసరం అయిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్ల యజమాన్యాలు కరోనా పేషెంట్లను వ్యాపార కోణంలో చూడవద్దని, వారికి సేవ చేయాలని, లక్షల రూపాయల ఫీజులు గుంజవద్దని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.