FbTelugu

కరోనా కట్టడికి సహకరించాలి: మంత్రి ఈటల

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రతి పౌరుడు మాస్కు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏమాత్రం అనుమానం ఉన్నా, లక్షణాలు కన్పించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలని మంత్రి రాజేందర్ కోరారు.

వైరస్‌ బారినపడిన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.