FbTelugu

మంత్రి సబితారెడ్డికి అస్వస్థత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అస్వస్థతకు గురయ్యారు.

శుక్రవారం తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అయితే, ఇంకా మెడికల్‌ టెస్టుల ఫలితాలు రాలేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.

You might also like