FbTelugu

విరివిగా రెమిడెసివిర్ లభ్యం: మంత్రి రాజేందర్

హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, 25 ఏళ్లకు పైగా ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరామమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం వరకు 2.70 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ఉత్పత్తి ని బట్టి, రాష్ట్రాల అవసరాలను బట్టి కేంద్రం వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందన్నారు. దేశంలో వ్యాక్సిన్ సమస్యను పరిష్కరించాలని, డిమాండ్ కు తగ్గట్టు సరఫరా పెంచాలన్నారు. ఆక్సిజన్ రోజుకు 260 టన్నులు వినియోగం ఉండగా ఇప్పుడు 300 టన్నుల వరకు డిమాండ్ ఉందన్నారు. ఇది కూడా ఆక్సిజన్ ను కూడా కేంద్రం పరిధిలోనే ఉంది. కరోనా ట్రీట్ మెంట్ ప్రోటోకాల్స్ మేరకే ఆక్సిజన్ ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. అవసరం లేకపోయినా ఆక్సిజన్ పెట్టవద్దని మంత్రి రాజేందర్ అన్నారు.

రేమిడెసివిర్ ఉత్పత్తి చేసే యాజమాన్యాలతో మాట్లాడామని, రేపటి నుంచి రేమిడిసివిర్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా రేమిడెసివిర్ అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్ట్రంలో బెడ్స్ కొరత లేదని, 60 వేల బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. కేవలం 5, 6 ఆస్పత్రుల్లోనే బెడ్స్ నిండిపోయాయాయన్నారు. 95 శాతం మందికి లక్షణాలు లేకుండా పాజిటివ్ నిర్థారణ అవుతోందని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.