FbTelugu

కేసీఆర్ ను తిడితే ఊరుకోం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

కామారెడ్డి: సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. మా సహనాన్ని పరిక్షించొద్దని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

కేసీఆర్ కు వంద కిలోమీటర్ల దూరమే నీవెప్పుడు… ఆయనను విమర్శిస్తే పెద్దోడివి ఐపోవని ఆయన హితవు పలికారు. జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… బండి సంజయ్ కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్న చందంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పెన్షన్ ల మీద,ఇతర సంక్షేమ కార్యక్రమాల మీద నేను రాజీనామా సవాల్ విసిరితే బండి సంజయ్ ఇంత వరకు చప్పుడు లేదన్నారు. బండి సంజయ్ దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని అన్నారు. మీ పార్టీ పెద్దలను, కేంద్రంలో ప్రభుత్వ పెద్దలను మేము మీకంటే బాగా తిట్టగలం… కానీ మాకు సంస్కారం అడ్డువస్తుందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.