FbTelugu

రాజీనామాతో ప్రైవేటీకరణ ఆగదు: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినా ఆగదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటనీ ఆయన టీడీపీని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంపై అంతా కలిసి పోరాడి సాధించుకోవాలని అన్నారు. రాజీనామాలు చేయాలని టీడీపీ చేస్తున్న డిమాండ్ లో పసలేదని, మళ్లీ ఎన్నికలు వస్తే వైసీపీ 170 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన చంద్రబాబు నాయుడు ఉక్రోషంతో అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ 90 శాతం విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీలును రక్షించుకునేందుకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ సమస్యపై కడా ఆయన అఖిలపక్షం సమావేశం నిర్వహించలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.