FbTelugu

కెసిఆర్ గత హామీని మరిచారు: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: అత్యంత కరువు ప్రాంతం రాయలసీమ కు నీరిచ్చేందుకు తనవంతు సాయం చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలో చెప్పారని ఏపి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంగా కెసిఆర్ స్యయంగా జగన్ తో ఈ మాటలన్నారని ఆయన తెలిపారు. వారిద్దరి మధ్య తానే సాక్షిగా ఉన్నానని అన్నారు. ఏపికి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామని, అదనంగా బొట్టు కూడా తీసుకోవడం లేదన్నారు. ఎక్కువ నీరు వాడుకోవాలని తమ ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వైఎస్ఆర్ ఎంతో సేవ చేశారని కూడా కెసిఆర్ పొగిడారని, ఇప్పుడు తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్ ను దొంగ అనడం, నరరూప రాక్షసుడు అనడం బాధ కలిగిస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.